'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి'

MHBD: సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలో నేడు ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు కాకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.