మీ పిల్లల ఆహారంలో నువ్వులు ఉన్నాయా?
చలికాలంలో పిల్లల ఆహారంలో తప్పక ఉండాల్సినవాటిల్లో నువ్వులూ ఒకటి. నువ్వుల్లో ఉండే కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్ వారి ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే గుండె పనితీరును మెరుగుపరిచి ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇంకా బెల్లంతో కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చు. అయితే రోజూ మితంగా తీసుకోవడం మంచిదని, లేదంటే బరువు, జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.