మొఘలాయిలను గడగడలాడించిన సర్వాయి పాపన్న..

JN: బహుజనుల రాజ్యాధికారం కోసం మూడున్నర శతాబ్ధాల క్రితమే సబ్బండ వర్గాలను ఏకంచేసి మొఘలాయిలను గడగడలాడించిన సాహసవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. 1650 ఆగస్టు 18న రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో జన్మించాడు. ఖిలాషాపూర్లో కోటను నిర్మించి మొఘల్లపై పోరాటం చేసి వారిపై విజయం సాధించి గోల్కండ ఖిల్లాను సొంతం చేసుకున్న చరిత్ర ఆయనది.