‘శివ’ రీ రిలీజ్.. ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..?

‘శివ’ రీ రిలీజ్.. ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..?

అక్కినేని నాగార్జున, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబోలో 1989లో తెరకెక్కిన ‘శివ’ ఈనెల 14న రీ రిలీజ్ కాగా తొలిరోజు వసూళ్లు అదరగొట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.2.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వారం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో వసూళ్లు పెరిగే అవకాశాలున్నాయి. నాగ్ సతీమణి అమల ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది.