గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమీక్ష

గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమీక్ష

కృష్ణా: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదిలోకి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్నందున అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండి అప్రమత్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ ద్వారా వరద పరిస్థితిని సమీక్షించారు.