ప్రొసీడింగ్ ఫారాలు పంపిణీ చేసిన కౌన్సిలర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో ఇందిరమ్మ లబ్దిదారులకు వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్ ప్రొసీడింగ్ ఫారాలు పంపిణీ అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. పేదల గృహ స్వప్నాన్ని నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తామని కాళ్ళ రాజమణి గణేష్ తెలిపారు.