ఎన్టీఆర్ అభివృద్ధి ప్రదాత: ఎమ్మెల్యే
TPT: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలు చిరస్మరణీయమన్నారు.