కళ్యాణి ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత

కళ్యాణి ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మించిన కళ్యాణి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. జలాశయంలోకి 350 క్యూసెక్కుల వరద నీరు రావడంతో అంతే మొత్తాన్ని రెండు గేట్లు ఎత్తి దిగువనకు అధికారులు శనివారం విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో408 మీటర్ల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.