జీవవైవిద్య పరిరక్షణ మన అందరి ధ్యేయం

VSP: జీవవైవిద్య పరిరక్షణ మనందరి ధ్యేయమని గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక అధ్యక్షులు జేవి రత్నం అన్నారు. సోమవారం ఎంవీపీ కాలనీలోని గల ఉషోదయ జంక్షన్‌లో పర్యావరణ పరిరక్షణ మాస ఉత్సవాలు ప్రారంభించి మాట్లాడుతూ.. సేంద్రీయ విత్తనాలను సేకరించి వాటిని బంతులుగా చేసి సామాజిక వనాలు పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.