రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కున్నాడు!

రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కున్నాడు!

MPలోని భోపాల్‌లో ఓ వ్యక్తి రైలు ఎక్కబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. భోపాల్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ అందుకునే క్రమంలో కదులుతున్న రైలు మధ్య ఆ వ్యక్తి ఇరుక్కుపోయాడు. కొన్ని సెకన్ల పాటు రైలు వేగానికి శరీరం నలిగిపోయినా, అదృష్టవశాత్తు పట్టాలపై పడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.