దేశ సేవకై ప్రాణాలర్పించారు: ఎమ్మెల్యే
GDWL: రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ, సమాజాన్ని సక్రమంగా ఉంచుతున్నది పోలీసులే అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశ సేవకు ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవాలన్నారు.