ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దు: CI
JN: మండలం శామీర్పేట గ్రామంలో డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత నియమాలు, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు CI సత్యనారాయణ ఆధ్వర్యంలో "పోలీసు కళాజాత" కార్యక్రమం నిర్వహించారు. CI మాట్లాడుతూ.. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.