'క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి'

'క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి'

KRNL: నగరంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. ఇవాళ నగరపాలక సమావేశ భవనంలో 'ఓపెన్ ఫోరం' కార్యక్రమం నిర్వహించారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించేందుకు, సమన్వయ లోపం వల్ల జాప్యం జరగకుండా, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.