మంతెన హత్య కేసును చేదించిన పోలీసులు

కృష్ణా: కంకిపాడు మంతెన గ్రామంలో జరిగిన హత్య కేసును కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఛేదించామని డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం మీడియాకు తెలిపారు. భవాని ప్రసాద్(24) గేమ్స్ ఆడి లోన్ యాప్‌లలో అప్పులు చేసి, తీర్చలేకపోవడంతో స్వర్ణ కుమారిని ఎవరు లేని సమయంలో హత్య చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసు దొంగిలించి పరారయ్యాడు. నిందితుడిని గురువారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు.