YSR విగ్రహానికి నివాళులర్పించిన ప్రత్తిపాడు ఇంఛార్జ్
గుంటూరు రూరల్ మండలం ఏటుకూరూ బైపాస్ రోడ్డులోని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.