లారీ ఆటో ఢీ.. ఒకరు మృతి

KNR: జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై గురువారం ఘోర రొడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్స్‌తో వెళ్తున్న ఆటోను ధాన్యం లోడ్‌తో ఉన్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.