నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత

KMR: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్లను అధికారులు సోమవారం ఉదయం ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 69,650 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 58,500, పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1403.28 అడుగులు, ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టిఎంసీలు, ప్రస్తుతం 15.364 టిఎంసీలు నీరు నిల్వ ఉందని అన్నారు.