లేబర్ కోడ్‌పై పరిశోధనకు గానూ చిట్టిబాబుకు పీహెచ్‌డీ

లేబర్ కోడ్‌పై పరిశోధనకు గానూ చిట్టిబాబుకు పీహెచ్‌డీ

విశాఖకు చెందిన యూ. చిట్టిబాబు న్యాయ విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా బుధవారం వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ చేతుల మీదుగా ఆయన పట్టా స్వీకరించారు. 'లేబర్ కోడ్-2020' అంశంపై ఆచార్య డి. సూర్య ప్రకాశరావు పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గానూ ఈ పీహెచ్‌డీ లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందించారు.