VIDEO: ఏడుపాయలలో కొనసాగుతోన్న వరద ప్రవాహం
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మ ఆలయం ఎదుట గురువారం మంజీరా నది పాయ ప్రవాహం కొనసాగుతోంది. గత వారానికి పైగా దుర్గమ్మ ప్రధాన ఆలయం పూజలకు, భక్తులకు దూరమైంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో వరద తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయం వైపు ఎవరిని వెళ్లనీయకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.