ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలి:మంత్రి

NRPT: వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు. సోమవారం మక్తల్ ఎంపీడీఓ కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత సాకుతో ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.