చెత్త మూటలతో హైవే రహదారిపై నిల్వలు

చెత్త మూటలతో హైవే రహదారిపై నిల్వలు

SKLM: సారవకోట మండలం నరసన్నపేట ప్రధాన హైవే రోడ్డుపై చెత్త కొనుగోలు చేసే మూటలు నిల్వ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒడిస్సా రాష్ట్రం నుండి పాతపట్నం సారవకోట మీదుగా శ్రీకాకుళం వెళ్లే వాహనదారులు అనేక పాట్లు పడుతున్నారు. ఎదురెదురు వాహనాలు వచ్చే సమయంలో ఇక్కడ ఇబ్బంది కలుగుతుందని వారు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.