కొడవలూరులో టీడీపీ పార్టీకి గట్టి షాక్

NLR: కొడవలూరు మండలం రేగడిచేలిక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బత్తల కమల్ తేజ యాదవ్, కటారి భాను యాదవ్, డబ్బుకొట్టు నాగార్జున, డబ్బుకొట్టు నాని యాదవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గురువారం వైసీపీ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.