వణికిస్తున్న వైరల్ జ్వరాలు

ADB: జిల్లాలో కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో పలుచోట్ల నిల్వనీటిలో దోమలు వృద్ధి చెందడం, వైరల్ ప్రభావంతో జ్వరాలు ముసురుకున్నాయి. ప్రధానంగా చిన్నారులు ఎక్కువ మంది జబ్బుల బారిన పడుతున్నారు. రిమ్స్‌లోని పిల్లల వార్డులో బుధవారం 113 మంది చిన్నారులు ఇన్‌పేషెంట్లుగా చేరడం తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నెలలో ఇప్పటికే 4 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.