VIDEO: MJP పాఠశాలలో విద్యార్థి అదృశ్యం.. బంధువుల ఆందోళన
MNCL: చెన్నూర్ MJP పాఠశాల 9వ తరగతి విద్యార్థి నాగవర్దన్ బుధవారం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు గురువారం హాస్టల్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ బిడ్డ ఆచూకీని వెంటనే కనుకొని, తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్ యజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి అదృశ్యమయ్యాడని ఆరోపించారు.