ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: బోగోలు మండలం బేతనీయపేట గ్రామంలో TDP యువనేత గోచిపాతల సంజయ్ ఆధ్వర్యంలో ప్రీ-క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేకు క్రైస్తవ సోదరులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం అన్నారు. ఎమ్మెల్యే వారికి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.