మోడల్ స్కూల్‌లో విద్యా ప్రమాణాలు భేష్: అకాడమిక్ ప్యానెల్
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్‌ను మంగళవారం అకాడమిక్ ప్యానెల్ బృందం సందర్శించింది. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో బోధనా విధానం, ల్యాబ్‌లు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా ప్రమాణాలు, సౌకర్యాల పట్ల బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రిన్సిపాల్ పీ. శ్రీనివాస్ తెలిపారు.