ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ

సత్యసాయి: విజయవాడలో వరదతో లక్షలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల దగ్గర వరద బాధితులకు సహాయనిధి సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి, ఎస్ఎఫ్ఎస్ఐ నాయకులు రాజా, విశ్వనాథ్, మోమిన్, బాషా పాల్గొన్నారు.