రోడ్డుపై కూలిన భారీ వృక్షం

రోడ్డుపై కూలిన భారీ వృక్షం

SRCL: గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని సిద్దిపేట-కామారెడ్డి ప్రధాన రహదారిపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.