రాజధాని అమరావతికి వెళ్లిన కలెక్టర్
AKP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టర్లతో నిర్వహించే సదస్సుకు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. మొదటి రోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు, సూపర్ సిక్స్ హామీలు రహదారుల పరిస్థితిపై సమీక్షిస్తారని అధికారులు పేర్కొన్నారు. వివిధ రంగాల నివేదికను కలెక్టర్ సమర్పిస్తారని తెలిపారు.