ఉప్పుగూడలో డ్రైనేజీ పైపులైన్ల మరమతులు
HYD: ఉప్పుగూడ పరిధిలోని అరుంధతి కాలనీలో మసీదు నుంచి రక్షాపురం కాలనీ కూడలి వరకు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత డ్రైనేజీ పైపులైన్లను మార్చి, మాన్ హోల్ మరమతులను చేపట్టారు. ఈ రహదారిలో దాదాపు ప్రతిరోజు మురికి నీరు ప్రవహిస్తుండటంతో బస్తీవాసులు, బాటసారులు, వాహనదారులు పలు ఇబ్బందులకు పడుతుండడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.