కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం
WGL: కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 7వ చిన్న నీటి వనరుల, జలాశయాల గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి మండల స్థాయిలో ఉన్న అధికారులతో సమన్వయం చేసుకుంటూ జల వనరుల గణనలో ఖచ్చితత్వం పాటించాలని తెలిపారు.