‘దసరానాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు'

NLR: ఈ దసరా నాటికి బీసీ కేటగిరీల లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని నెల్లూరు నగర కమిషనర్ నందన్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 47 అర్జీలు అందాయన్నారు. వీటిలో 20 టిడ్కో ఇళ్లకు సంబంధించాయని తెలిపారు. పంపిణీకి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.