'ఎలుగుల కొండను కాపాడుతాం'

PPM: పార్వతీపురం మండల పరిధిలోని పెదబొండపల్లి, హెచ్ కారాడ వలస రెవిన్యూ పరిధిలో ఉన్నటువంటి ఎలుగుల మెట్టపై మైనింగ్ క్వారీ అనుమతులు రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దీని మూలంగా వందలాది ఎకరాల పంట భూములు నష్టపోవడమే కాకుండా ప్రజలు ముఖ్యంగా పశువుల పెంపకదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది అన్నారు. రైతులతో కలసి పోరాటం చేస్తామన్నారు.