రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

RR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన శంషాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. పెద్ద షాపూర్ తండా నుంచి రోడ్డు దాటుతున్న మహిళను బుల్లెట్ వాహనం ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.