VIDEO: ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు
MDK: ద్విచక్ర వాహనం ఆటోకు అడ్డు రావడంతో అదుపుతప్పి బోల్తాపడగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సిద్దిపేట వైపు నుంచి రామాయంపేటకు వస్తున్న ఆటోకు ద్విచక్ర వాహనం యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఆటోను ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.