VIDEO: 'లేబర్ చట్టాలు రద్దు చేయాలి'
TPT: శ్రీకాళహస్తిలోని సీపీఎం కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. వివిధ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను నిరసిస్తూ ఈనెల 26న దేశవ్యాప్తంగా జరిగే నిరసనలను జయప్రదం చేయాలని కోరారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తామన్నారు.