రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రాక్టర్

రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రాక్టర్

KNR: మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ కారును ఢీకొట్టిన ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్ వద్ద చోటుచేసుకుంది. గొల్లపల్లికి చెందిన నాగపురి రమేశ్ తన ట్రాక్టరుతో ఇసుక తరలిస్తుండగా, గోపాల్‌పూర్ స్టేజ్ వద్ద మలుపు తిరుగుతూ మంచిర్యాల వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.