హిందీ పరీక్షకు 99.75% మంది విద్యార్థులు హాజరు: DEO
KMR: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసాయని డీఈవో రాజు తెలిపారు. రెండో రోజు హిందీ పరీక్షకు 99.75% మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తునమన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటునట్లు వెల్లడించారు.