జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
HNK: బీమదేవరపల్లి RDO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కపిల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు రావడంతో విచారణ చేసారు. కపిల్ ఎదుర్కొన్న విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్న సమయంలో కపిల్ అక్రమంగా 21 రిజిస్ట్రేషన్లు చేశాడని తెలుస్తోంది.