మందుబాబులకు BAD NEWS
TG: శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. దీంతో వైన్ షాపులతో పాటు బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు కూడా బంద్ కానున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.