VIDEO: ఘనంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం
MDK: రామయంపేట మండల పరిధిలోని కాట్రియాల గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు కన్నుల పండువగ సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పెద్దమ్మ-పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం భక్తుల జయద్వనాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు.