నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్

AKP: అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని శ్రావణమాసం 5వ శుక్రవారం సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మండపంలో మహిళలతో కలిసి సామూహికంగా కుంకుమ పూజలో పాల్గన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.