ముత్యాలమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే

SRPT: తాళ్లగడ్డలో గల శ్రీఇంద్రవెల్లి ముత్యాలమ్మ బోనాల పండుగకు ఆదివారం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు పండాలని కోరుకున్నారు. అదేవిధంగా ముత్యాలమ్మ అమ్మవారి బోనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.