ఎల్లారెడ్డిపేటలో ప్రారంభమైన రేషన్ షాప్

ఎల్లారెడ్డిపేటలో ప్రారంభమైన రేషన్ షాప్

NRML: ప్రభుత్వం ఉచిత రేషన్​ ఇస్తున్నటి నుంచి​ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఇప్పటివరకు రేషన్ షాప్​​ లేదు. దీంతో గ్రామస్తులు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాయిపేటలోని రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ అభిలాష అభినవ్ ఎల్లారెడ్డిపేటలోనే రేషన్ షాపు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో రేషన్ షాప్ ప్రారంభమైంది.