'AI ఒక్క సాధనం కాదు.. భవిష్యత్తును నిర్మించే శక్తి'
CTR: ఏఐ కేవలం సాధనం మాత్రమే కాదు, భవిష్యత్తును రూపొందించే శక్తి అని అపోలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా. వినోద్ భట్ బుధవారం తెలిపారు. అపోలో యూనివర్సిటీలో యునిసెఫ్, స్కిల్ రూట్ సంస్థల సంయుక్తంగా నిర్వహించిన “ఉచిత కృత్రిమ మేధస్సు.. చాట్‌జీపీటీ శిక్షణా కార్యక్రమం” బుధవారం ప్రారంభమైంది. ఈ శిక్షణా తరగతులు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి.