కోటి ఉద్యోగాల కల్పన: కేంద్రమంత్రి
దేశంలో వెనుకబడిన 120 జిల్లాల్లో డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పరిశ్రమ వర్గాలతో కలిసి వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నిర్వహించిన 'సడక్ సురక్షా అభియాన్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.