అమెరికాలో పద్మశాలి వనభోజనాలు

TG: అమెరికాలోని డల్లాస్ నగరంలో నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మే3, 2025 శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి నాపా అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్, లిటిల్ ఎల్మ్ నగర డిప్యూటీ మేయర్ టోనీ సింగ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.