పట్టణంలో హోటళ్లపై ఆకస్మిక దాడులు..
MDK: నర్సాపూర్ పట్టణంలో సివిల్ సప్లై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లపై దాడులు చేసి 46 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. DSP వెంకటేశం తెలిపిన ప్రకారం 29 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసిన వాటిలో 38 HP, 6 భారత్, 2 ఇండియన్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి.