ఆసుపత్రుల సమస్యలు జాయింట్ సెక్రెటరీ దృష్టికి
SKLM: పలాస నియోజకవర్గ పరిధిలోని PHC, CHCల్లోని పలు సమస్యలను ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ రోణంకి గోపాలకృష్ణ దృష్టికి ఎమ్మెల్యే గౌతు శిరీష తీసుకెళ్లారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో బుధవారం ఆమె భేటీ అయ్యారు. ప్రభుత్వ వైద్యశాలలను మరింత పటిష్టం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.