ఆసుపత్రి ప్రారంభించడంలో జాప్యం పట్ల ఆగ్రహం
NLG: నకిరేకల్‌లో 32 కోట్ల రూపాయల వ్యయంతో 80 శాతం పనులు పూర్తయిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయటం పట్ల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఆసుపత్రిని మంగళవారం పరిశీలించారు. కొద్దిపాటి పెండింగ్ పనులను చేపట్టడంలో కూడా ప్రభుత్వం అలసత్వం చూపించడం పట్ల ఆవేదన చెందారు.